‘కాంగ్రెస్‌ వెనక చంద్రబాబు నీడ ఉంది’ | Kalvakuntla Kavitha Slams Congress For alignment With TDP | Sakshi
Sakshi News home page

Dec 3 2018 2:35 PM | Updated on Dec 3 2018 5:17 PM

Kalvakuntla Kavitha Slams Congress For alignment With TDP - Sakshi

చంద్రబాబు వస్తే ప్రాజెక్టులకు చంద్ర గ్రహణం పడుతుంది

సాక్షి, నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ వెనక చంద్రబాబు నీడ ఉంది.. అది గమనించి ప్రజలు ఓట్లు వేయాలంటూ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. 60 ఏండ్లలో అన్నదాతలను పట్టించుకున్న ప్రభుత్వాన్ని చూశారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ రైతులను ఆదుకుంటుందని పేర్కొన్నారు. స్థలం ఉండి ఇళ్లు కట్టుకుంటే రూ. 5 లక్షల అప్పు ఇస్తాం అని కాంగ్రెస్‌ చెబుతోంది.. కానీ టీఆర్‌ఎస్‌ ఇచ్చే ఐదు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు మత, కుల పిచ్చి లేదని వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగలంటే టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండంటూ కవిత ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసింది.. చంద్రబాబు వస్తే వాటిన్నింటికి చంద్ర గ్రహణం పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ వెనక చంద్రబాబు నీడ ఉంది.. అది గమనించి ఓటు వేయాలంటూ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement