మంత్రి సోమిరెడ్డి పై ఎమ్మెల్యే కాకాణి ఫైర్‌

Kakani Govardhan Reddy Fire On Somireddy Chandramohan Reddy - Sakshi

సాక్షి, నెల్లూరు: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై వైసీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకొని రైతుల పొట్ట కొడుతున్నారంటూ సోమిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. కాకాణి గోవర్దన్‌ రెడ్డి మంగళవారం నెల్లూరులో మాట్లాడుతూ... నాలుగేళ్లుగా టీడీపీ  రైతులకు చేసిందేమీ లేదని, అవినీతిలోమాత్రం అభివృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు.‘రైతు రథం’ పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఆ పథకం ద్వారా నిజమైన రైతులు లబ్ది పొందడంలేదని, టీడీపీ శ్రేణులకే అది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  వ్యవసాయ మంత్రి అక్రమంగా కోట్లు సంపాదించారని, ఆయన అవినీతిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కాకాణి డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top