వైఎస్సార్‌సీపీలో చేరిన కదిరి బాబూరావు

Kadiri Baburao Joins In YSRCP - Sakshi

సాక్షి, తాడేపల్లి : మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిట్ట అని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే మడమతిప్పని నాయకుడు అని అన్నారు. సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం తనకు చెప్పకుండా దర్శికి పంపి.. బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేయించారని గుర్తుచేశారు. బాలకృష్ణ చెప్పిన మాటను చంద్రబాబు పట్టించుకోలేదు. బాలకృష్ణపై అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగనని చెప్పారు. బాలకృష్ణ మంచి వ్యక్తి అని వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్‌సీపీ నాయకులు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సీఎం జగన్‌ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబును చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీలో మోసపూరిత వైఖరి నెలకొందని విమర్శించారు. 

బాబుకు అభ్యర్థులు దొరకడం లేదు : రామచంద్రయ్య
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. బీజీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబుకు నిజాయితీ లేదని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top