జోన్‌ల పేరుతో కేసీఆర్‌ నాటకాలు: జీవన్‌రెడ్డి | Jeevan Reddy Slams On KCR Over New Zones | Sakshi
Sakshi News home page

జోన్‌ల పేరుతో కేసీఆర్‌ నాటకాలు: జీవన్‌రెడ్డి

Aug 27 2018 5:05 AM | Updated on Aug 27 2018 5:05 AM

Jeevan Reddy Slams On KCR Over New Zones - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జోన్‌ల పేరుతో కేసీఆర్‌ సరికొత్త నాటకాలకు తెరతీశారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జోన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ చెబుతున్నారని, అయితే కొత్త జిల్లాలను ఆమోదానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ గుర్తుకు రాని నిరుద్యోగుల సమస్యలు కేసీఆర్‌కు ఇప్పుడే గుర్తుకు రావటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా కేసీఆర్‌ నడుచుకుంటున్నారని, మోదీకి అమిత్‌షా కన్నా కేసీఆరే సన్నిహితుడని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement