‘ముందస్తు ఎన్నికలు.. కాంగ్రెస్‌కు సంతోషం’

ఢిల్లీ: ముందస్తు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిథి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా టీఆర్ఎస్‌కు ముందస్తు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వెళ్లినపుడు సింహంలా దూకుతుందని అభివర్ణించారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే కారణంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. మోదీతో మిత్రత్వం దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయపార్టీ అని, కొంత మంది అసంతృప్తివాదులు ఉంటారని.. కానీ యుద్ధంలోకి దిగేటపుడు అందరూ ఒక్కటవుతారని వెల్లడించారు.
మిషన్ భగీరథ ద్వారా ఎవరికీ నీరు రాలేదని, కేవలం కాంట్రాక్టర్లకు నిధులు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు ప్రచారం నిర్వహించాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం అయ్యాయని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా తెల్సిందని అన్నారు. కేసీఆర్ హామీలను విస్మరించారని, మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి