694 మంది ఆటగాళ్లు.. ఆ ఇద్దరికే రూ.100కోట్లు

IPL : MS Dhoni And Rohit Sharma Reach 100 Crores Salary club - Sakshi

ఇండియాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ద్వారా కోట్లలో వ్యాపారం జరుతుందనే విషయం తెలిసిందే. ప్రతి సంత్సరం ఏప్రిల్‌-మేలో ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. ఐపీఎల్‌ ప్రారంభయిందంటే ప్రేక్షకులకు పండుగే. కొంతమంది ప్లేయర్స్‌ ఎక్కువ ధర పలికి కోట్ల రూపాయాలను తమ ఖాతాలో వేసుకుంటారు. అయితే 11 సీజన్లలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు 694 ఆటగాళ్లలతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. కానీ, కేవలం ఇద్దరు మాత్రమే రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లు సంపాదించారు. 

మిస్టర్‌ కూల్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు ఐపీఎల్‌ వందకోట్ల క్లబ్‌ చేరిపోయారు. వీరు ఇప్పటివరకూ జరిగిన మొత్తం ఐపీఎల్‌లో ఆ జట్టు యాజమాన్యం నుంచి వేతన రూపంలోనే రూ. 100 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. మిస్టర్‌ కూల్‌ ధోని రూ. 107.8 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ రూ. 101.6 కోట్లతో రెండోస్థానంలో ఉన్నాడు.

ప్రేక్షకులు ఎంతగానో అదరించే ఐపీఎల్‌ మొదటి సీజన్‌ 2008 నుంచి ప్రారంభమైన విషయం విదితమే. ఫస్ట్‌ సీజన్‌లో చెన్నై యాజమాన్యం రూ. 6కోట్లకు ధోనిని సొంతం చేసుకుంది. మిస్టర్‌ కూల్‌ 2008 నుంచి 2015 వరకూ చెన్నై జట్టు ప్రాతినిధ్యం వహించాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై జట్టుపై 2016, 2017 నిషేధం విధించారు. ఆ రెండు సంవత్సరాలు ధోని రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌కు ఆడాడు. తిరిగి ఈ సంవత్సరం చెన్నై జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. 11వ సీజన్‌లో ధోని చెన్నై జట్టును విజయంవైపు నడిపించాడు. తొమ్మిది సీజన్‌లు అడిన చెన్నై జట్టు మూడు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. 

రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ మొదటి సీజన్‌ డెక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడాడు. అప్పుడు డెక్కన్‌ యాజమాన్యం రూ. 3కోట్లకు రోహిత్‌ను కైవసం చేసుకుంది. 
ఆ తర్వాత నుంచి ముంబై జట్టుకు ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌ మూడుసార్లు ఐపీఎల్‌ విజేత నిలిచిన విషయం తెలిసిందే. ఆరంభం నుంచే వీరు కోట్లలో పలికారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌-11వ సీజన్‌లో దోని, రోహిత్‌ల కోసం ఆ జట్టు యాజమాన్యాలు రూ. 15కోట్లు పెట్టాయి. ఐపీఎల్‌ మొత్తంలో 694 మంది ఆటగాళ్లలో కేవలం ధోని, రోహిత్‌ శర్మలు మాత్రమే రూ. 100కోట్ల క్లబ్‌లో చేరారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top