సీఎం బస చేసిన హోటల్లో ఐటీ తనిఖీలు 

Income Tax Raids AT Hotel Where CM Kumaraswamy Stayed - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన కుమారుడు, మాండ్య జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ బస చేస్తున్న హోటల్‌లో ఐటీ అధికారులు గురువారం సోదాలు జరిపారు. మాండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్‌లో ఉన్న రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్‌లో వీరు ప్రచారం కోసం వచ్చి బసచేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు 30 బృందాలతో ఐటీ అధికారులు అక్కడకు చేరుకుని హోటల్లో సోదాలు నిర్వహించారు. సీఎం కుమారస్వామి దీనిపై స్పందిస్తూ.. హోటల్‌ గదిలో తాము లేని సమయంలో దాడులు చేశారని చెప్పారు. జేడీఎస్, కాంగ్రెస్‌ నేతలే లక్ష్యంగా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. కుమారస్వామి సన్నిహితుడు, హోసకోట తాలూకా జేడీఎస్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  

యడ్యూరప్ప హెలికాప్టర్‌ తనిఖీ
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ ఘటన బాగలకోటె జిల్లా బాగలకోటె నవనగరలోని హెలీప్యాడ్‌ వద్ద జరిగింది. 


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top