అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం

If Corruption Is Not Done I Am Ready For Any Punishment - Sakshi

సాక్షి, అమరావతి: పట్టిసీమలో అవినీతి జరిగింది.. జరగలేదంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసే ఏ శిక్ష కైనా తాను సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్సీ విష్ణు కుమార్‌ రాజు సవాల్‌ విసిరారు. ఆయన విలేకరులతో​ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే పట్టిసీమపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్ కోసమే సీఎం పార్లమెంటు మెట్లకు మొక్కారని ఎద్దేవా చేశారు. రోజూ ఇసుక కుంభకోణంలో కోట్లు కొల్ల గొడుతున్నారని, పట్టిసీమ, ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

‘సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇది భారత దేశ ప్రజలను అవమానించడమే. సీఎం 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని మంత్రి గంటా శ్రీనివాస రావు బీజేపీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులతో ఉద్యమానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు’  అని విష్ణు కుమార్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top