పిల్లలతో కుస్తీ పోటీయా?

I donot wrestle with kids, Sharad Pawar tells CM Fadnavis - Sakshi

బీడ్‌: మహారాష్ట్రలో తమతో తలపడే మల్లయోధుడే లేరన్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వ్యాఖ్యలకు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ దీటుగా సమాధాన మిచ్చారు. పసికూనలతో ఎవరు తలపడతారంటూ ఎద్దేవా చేశారు. బీడ్‌ జిల్లా అంబేజొగయ్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ...ఇక్కడ మహారాష్ట్ర స్టేట్‌ రెజిలింగ్‌ అసోసియేషన్‌ అనే ఒకటుంది. దాని అధ్యక్షుడి పేరు శరద్‌ పవార్‌. రెజిలర్లందరికీ అండగా నేనుంటా. మేం పిల్లలతో పోటీకి దిగం’అని పేర్కొన్నారు. తమకు పోటీయే లేదని చెబుతున్న బీజేపీ నేతలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, యూపీ సీం ఆదిత్యనాథ్‌ వంటి వారితో రాష్ట్రంలో ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారని పవార్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top