వైరల్‌ : లోకేష్‌.. పసుపు కుంకుమ మాకు రాలే! | Hilarious Jokes in Social Media on Nara Lokesh | Sakshi
Sakshi News home page

వైరల్‌ : లోకేష్‌.. పసుపు కుంకుమ మాకు రాలే!

Mar 24 2019 11:18 AM | Updated on Mar 24 2019 11:23 AM

Hilarious Jokes in Social Media on Nara Lokesh - Sakshi

 చంద్రబాబు ఏకైక సుపుత్ర రత్నం నారా లోకేష్‌ అలియాస్‌ అయోమయం

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు ఏకైక సుపుత్ర రత్నం నారా లోకేష్‌  ఎన్నికల ప్రచారంలో తన దివ్య ప్రసంగాలతో నవ్వులు పూయిస్తున్నారు. ఎప్రిల్‌ 11న ఎన్నికల పోలింగ్‌ అయితే  9న ఓటేయ్యండని నోరు జారిన లోకేశ్‌.. మంగళగిరిలో తనదే విజయమని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ప్రగ్భాలాలు పలికారు. ఇది విన్నా జనాలు ఇదెక్కడి గోలరా నాయనా.. నియోజకవర్గంలో ఉన్నదే 2 లక్షల 23 వేల 300 ఓటర్లు అయితే.. లోకేష్‌ అలియాస్‌ అయోమయం ఐదు లక్షల మెజార్టీతో ఎలా గెలుస్తారని, ఇదంతా తమ కర్మా! అని చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు పసుపు-కుంకమ అనే కొత్త డ్రామాకు తెరలేపిన తండ్రి కొడుకులను జనాలు నిలబెట్టి నిలదీస్తున్నారు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నారా లోకేష్‌ ‘అక్కా.. పసుపు-కుంకుమ మొదట విడత కింద 10 వేల రూపాయలు వచ్చాయా?’ అని ఏదో బిల్డప్‌తో అడిగాడు.

దీనికి అక్కడున్న మహిళలు రాలేదు.. మాకు రాలేదు.. అనడంతో కంగుతిన్న లోకేష్‌.. ఏం మాట్లాడాలో తెలియక తెల్ల మొహం వేశారు. ఆ అక్కకు వచ్చాయంట..  ఆ వచ్చినవని తానే చెప్పుకుంటూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మంత్రి అయిన తరువాతనన్న మారాడుకున్నామని.. కానీ పప్పు.. పప్పేనని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గతంలో కూడా నారా లోకేష్‌ పప్పులో కాలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘అంబేద్కర్‌ వర్ధంతి శుభాకాంక్షలు..’, ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement