రాష్ట్ర హోదా ఇస్తే బీజేపీకి ప్రచారం: కేజ్రీవాల్‌ | Grant statehood to Delhi, will campaign for you in 2019 elections | Sakshi
Sakshi News home page

రాష్ట్ర హోదా ఇస్తే బీజేపీకి ప్రచారం: కేజ్రీవాల్‌

Jun 12 2018 2:11 AM | Updated on Jun 12 2018 9:16 AM

Grant statehood to Delhi, will campaign for you in 2019 elections - Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే కేంద్రం ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తే ఆ ఎన్నికల్లో తాము బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం ఢిల్లీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకుంటారా లేక అది కేవలం ఓ అబద్ధపు, మోసపూరిత హామీగా మిగిలిపోనుందా అని ప్రశ్నించారు. దేశమంతటికీ 1947లో స్వాతంత్య్రం వచ్చినా ఢిల్లీకి మాత్రం రాలేదనీ, బ్రిటిష్‌ వారికన్నా ఘోరమైన రీతిలో కేంద్రం ఢిల్లీ ప్రజలను హింసిస్తోందంటూ కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement