మాజీ మంత్రి పీతల సంచలన వ్యాఖ్యలు

Former Minister Peethala Sujatha Shocking Comments About Lokesh - Sakshi

సాక్షి, నెలమూరు:  ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామదర్శిని సభలో మంత్రులు నారా లోకేష్, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి పీతల సుజాత, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి‌ లోకేష్ అంటూ సంభోదించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో‌ కేంద్రానికి వెళ్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీతల సుజాత వ్యాఖ్యలతో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. 

అంతకుముందు పెనుగొండ గ్రామదర్శిని సభలో మంత్రి నారా లోకేష్‌కు మహిళలు షాక్‌ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పితాని సత్యనారాయణ సమక్షంలోనే మహిళలు సమస్యలపై మొరపెట్టుకున్నారు. తమకు ఇళ్లు, మరుగుదొడ్లు లేవని, ఇళ్ల స్థలాలు ఇప్పించండంటూ మహిళలు పెద్ద సంఖ్యలో అర్జీలు ఇచ్చారు. పితాని సమక్షంలోనే భారీగా ఫిర్యాదులు రావడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకోవడంతో మంత్రి‌ లోకేష్, ఇన్ని సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయా అని విస్తుపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top