
పవన్ కల్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది.
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అని సినీ హీరో సుమన్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. తాను పుట్టిన తర్వాత ఒకే పార్టీకి (వైఎస్సార్‌సీపీ -151) ఇన్ని సీట్లు రావడం ఇదే తొలిసారి అన్నారు.
మహిళలను గౌరవించి ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ఇచ్చిన ఘనత కూడా సీఎం వైఎస్ జగన్‌దే అని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ఇండస్ట్రీని ఏపీకి తీసుకొచ్చి అన్నివిధాల ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తే వచ్చే ఐదేళ్లు కూడా సీఎం వైఎస్ జగన్‌నే అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కారణంగానే తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు.