ఆర్టీసీ యూనియన్‌ నేతలలో ఎండీ చర్చలు విఫలం

Fails In Talks Between RTC And Union - Sakshi

సాక్షి, విజయవాడ : ఆర్టీసీ యూనియన్‌ నేతలలో ఎండీ సురేంద్రబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు గంటకు పైగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అంగీకరించలేదు. దీంతో చర్చల మధ్య నుంచే ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, దామోదర్‌ రావులు బయటకు వచ్చారు.అనంతరం జేఏసీ నాయకులు మీడీయాతో మాట్లాడుతూ.. వేతన సవరణపై మీటింగ్‌లో చర్చించామని చెప్పారు. 50శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే 20శాతానికి మించి ఇవ్వలేమని ఎండీ తేల్చిచెప్పారని, దానికి తాము అంగీకరించలేదన్నారు. తాము చేపట్టబోయే సమ్మేను విరమించే ప్రసక్తే లేదన్నారు.

బుధవారం ఉదయం జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ఒకవైపు చర్చలు జరుతూనే మరోవైపు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. తమది న్యాయమైన డిమాండ్లు అని, వాటిని సాధించుకునే వరకు పోటాటం చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాబోయే బడ్జెట్‌లో ఆర్టీసీకి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top