ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ | Every MP Should Solve Water Problem In Their Constituency PM Modi Says | Sakshi
Sakshi News home page

‘నీటి సమస్యలపై దృష్టి పెట్టండి’

Jul 16 2019 11:15 AM | Updated on Jul 16 2019 11:15 AM

Every MP Should Solve Water Problem In Their Constituency PM Modi Says - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాగునీటి సమస్యలపై ప్రతి ఒక్క ఎంపీ దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య అని, దీనిపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఎంపీలను సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీలకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement