breaking news
water problem solve
-
ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : తాగునీటి సమస్యలపై ప్రతి ఒక్క ఎంపీ దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య అని, దీనిపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఎంపీలను సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీలకు చెప్పారు. -
నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
అనంతపురం సిటీ : అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు నోడ్ల్ ఆఫీసర్ సీఈ రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్నాయక్తో కలిసి అనంతపురం జిల్లాలోని చియ్యేడు, పూల కుంట, మడకశిర, మడకశిర సమీప గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పాటు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రధాన పైపులైన్ పనులు జరుగుతుండడం వల్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు. ఈ పనులు త్వరలో పూర్తికాగానే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఉండదన్నారు. పైప్లైన్ పనులు పూర్తయితే సమస్య తీరుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించామన్నారు. మరిన్ని మార్గాలు అన్వేషించి గ్రామాల్లో శాశ్వత తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.