నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు | special actions of water problem solve | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు

Mar 11 2017 11:17 PM | Updated on Sep 5 2017 5:49 AM

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు నోడ్‌ల్‌ ఆఫీసర్‌ సీఈ రవిబాబు తెలిపారు.

అనంతపురం సిటీ : అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు నోడ్‌ల్‌ ఆఫీసర్‌ సీఈ రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్‌తో కలిసి అనంతపురం జిల్లాలోని చియ్యేడు, పూల కుంట, మడకశిర, మడకశిర సమీప గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పాటు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రధాన పైపులైన్‌ పనులు జరుగుతుండడం వల్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు.

ఈ పనులు త్వరలో పూర్తికాగానే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఉండదన్నారు. పైప్‌లైన్‌ పనులు పూర్తయితే సమస్య తీరుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించామన్నారు. మరిన్ని మార్గాలు అన్వేషించి గ్రామాల్లో శాశ్వత తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement