ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టాలి 

Telangana Elections Special Intelligence Branch Nizamabad - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు ప్రలోభాలకు గురికాకుం డా నగ దు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టా లని జిల్లా కలె క్టర్‌ రామ్మో హన్‌ రావు ఆదా య పన్ను శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లో పది లక్షలకు పైన జరిగిన లావాదేవీలను ఐటీ శాఖకు ప్రతిరోజు అందజేస్తార ని తెలిపారు. అక్రమంగా తరలిస్తు న్న నగదును పసిగట్టేందుకు నిఘా పెటాలని, బస్టాండు, రైల్వేస్టేషన్‌లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. అవసరమైన సందర్భంలో అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీఏడీ లక్ష్మన్‌బాబుకు సూచించారు.
 
నోడల్‌ అధికారులతో సమీక్ష... 
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల దరఖాస్తులకు 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని కలెక్టర్‌ నోడల్‌ అధికారులకు సూచించారు. తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. వాహనాలు, సమావేశాలు, ర్యాలీ, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ తదితర అనుమతుల కోసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సువిధ వెబ్‌సైట్‌కు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ అనుమతి మాత్రమే జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన చేసి అనుమతి జారీ చేస్తారన్నారు. రవాణా, ఆర్‌అండ్‌బీ, పోలీసులు ఇతర సంబంధిత అధికారులు ఆర్‌ఓ కార్యాలయానికి లైజన్‌ అధికారులను నియమించాలన్నారు. ఈ అధికారులందరూ ఆర్‌ఓ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని, ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం బాధ్యతగా సత్వరమే నివేదికలు అందజేయడానికి కృషి చేయాలన్నారు.

ఎన్నికలకు అవసరమైన ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలను గుర్తించి సోమవారం వరకు నివేదిక అందజేయాలని ఆర్‌టీఓ వెంకటేశ్వర్‌ రెడ్డిని ఆదేశిం చారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు కలిసి వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ సమకూర్చేందుకు టెండర్‌ పిలిచి తక్కువ ధరకు రేటు కోడ్‌ చేసిన వారిచే సరఫరా చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు సరఫరా చేసే సందర్భంలో వాహనాలను సిద్ధం చేయాలని మెటీరియల్‌ నోడల్‌ అధికారి చతుర్వేదికి సూచించారు. అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని, అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు సాలూర, కందకుర్తిల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, అడిషనల్‌ డిప్యూటీ సీపీ శ్రీధర్‌ రెడ్డి, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top