‘మోదీ పీఏగా ఈసీ’ 

EC working like personal assistant of PM  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పీఏగా ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఓటింగ్‌ జరుగుతున్న క్రమంలో రోడ్‌షో నిర్వహించిన ప్రధానిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పుపట్టింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఓటు వేసిన అనంతరం ప్రధాని రోడ్‌షో నిర్వహించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జీవాలా అన్నారు.

మోదీపై చర్య తీసుకోకుండా ఈసీ బీజేపీ జేబుసంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈసీ తీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ప్రధాని పీఎస్‌గా ప్రవరిస్తున్నారని విమర్శించారు.

గుజరాత్‌ టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌కు ఈసీ షోకాజ్‌ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు ఈసీ, ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top