బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకోవద్దు’

Do not interfere in bathukamma saree distribution - Sakshi

సిరిసిల్ల: బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకోవద్దని కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ కోరా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం టీఆర్‌ఎస్‌ జెండా పండుగలో ఆయన మాట్లాడారు. సమైక్యరాష్ట్రంలో బతుకమ్మ పం డుగ వివక్షకు గురైందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఆడబిడ్డలకు చీరను కానుకగా గతేడాది నుంచి అందిస్తోందని ఎంపీ వివరించారు. ఇది కొత్తగా ప్రారంభించిన పథకం కాదని, మే నెలలోనే బతుకమ్మ చీరలకు రూ.280 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ కోరితే తాను ఢిల్లీకి వెళ్లి భారత ఎన్నికల సంఘాన్ని కలుస్తా నని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ నిలిపి వేతపై ఎన్నికల కమిషన్‌ పునరాలోచించా లని కోరారు. కోర్టుపక్షి కాంగ్రెస్‌ అభివృద్ధి పనులపై కేసులు వేయడమే కాకుండా చివరకు ఆడబిడ్డలకు పండుగ కానుకనూ రాజకీయం చేసి అడ్డుకోవాలని చూడటం బాధాకరమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top