కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల డీఎన్‌ఏ ఒక్కటే

DNA of Congress and TRS is the only one - Sakshi

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

జహీరాబాద్‌: కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల డీఎన్‌ఏ ఒక్కటే అని, ఆ రెండూ కుటుంబ పార్టీలే అయినందున వాటిని ఓడించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే సాగుతోందని, టీఆర్‌ఎస్‌లో సైతం ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.

బీజేపీలో కులం, మతం ఉండదు..
చాయ్‌ అమ్ముకునే వ్యక్తిని ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క బీజేపీకే సాధ్యమైందని మురళీధర్‌రావు అన్నారు. తమ పార్టీలో కులం, మతం ఉండదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ చేతకాని పార్టీ అని, అందుకే ముందస్తుకు వెళ్లిందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని, తమ పార్టీ అభ్యర్థి గోపిని గెలిపించాలని కోరారు. బంగారు తెలంగాణ ఏమో కాని తాగుబోతుల తెలంగాణగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని మార్చారన్నా రు.  టీఆర్‌ఎస్‌ పార్టీ మజ్లిస్‌కు తొత్తుగా మారిందని విమర్శించారు.  కాంగ్రెస్‌ గెలిస్తే పరోక్షంగా టీడీపీయే ప్రభుత్వాన్ని ఏలుతుందన్నారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top