దానం అంటేనే దందాలు | Dasoju sravan kumar commented over danam nagender | Sakshi
Sakshi News home page

దానం అంటేనే దందాలు

Nov 19 2018 2:18 AM | Updated on Nov 19 2018 2:18 AM

Dasoju sravan kumar commented over danam nagender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప తనకు ఏ గూండాయిజం తెలియదని ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ అన్నారు. దానం నాగేందర్‌ అంటేనే దళారితనం, దందాలు, కబ్జాలని ఆరోపించారు.

దానంకు ఖైరతాబాద్‌లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. దాంతోనే ఎవరికో డబ్బులు ఇచ్చి తనకు టికెట్‌ ఇప్పించానని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌ లో మధుకర్‌యాదవ్, నిరంజన్, మహేశ్‌యాదవ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజలు 15 రోజులు తన కోసం వెచ్చిస్తే జీవితాంతం నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement