మొన్న స్కూటర్ల మీద తిరిగినోళ్లు ఇప్పుడు ఆడి కార్లలో..

CPI Rama Krishna Slams Chandrababu In Vijayawada - Sakshi

విజయవాడ: నగరాన్ని అభివృద్ధి చేయడం అంటే కార్పొరేటర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టడం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మొన్నటిదాకా స్కూటర్లలో తిరిగిన కార్పొరేటర్లు ఇప్పుడు ఆడికార్లలో తిరుగుతున్నారని విమర్శించారు.  రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన చంద‍్రబాబు.. పరిశ్రమలు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రానికి మోదీ నాలుగేళ్లుగా అన్యాయం చేస్తుంటే నోరుమెదపని సీఎం చంద్రబాబు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మోదీని విమర్శిస్తూ, ధర్మపోరాటాలంటూ కొత్తనాటకాలకు తెరతీశారని విమర్శించారు. జనసేన కొత్త పార్టీ కాబట్టే ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top