మోదీది దళిత వ్యతిరేక ప్రభుత్వం: సురవరం

CPI Leader Slams Narendra Modi Over Attack On Dalits - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో సింహగర్జన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలు పార్టీల నేతలు సహా, రాష్ట్రాల నుంచి దళిత సంఘా ల నేతలు హాజరయ్యారు. దీక్షలో పాల్గొన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అంటరానితనాన్ని బలపరుస్తోందని మండిపడ్డారు. గోరక్ష పేరు తో హింసను ప్రేరేపిస్తున్న బీజేపీ, దళితుల సంక్షేమా న్ని పట్టించుకోవడం లేదన్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి పరిరక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని షెడ్యూ ల్‌ 9లో చేర్చాలని చేస్తున్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. దీక్షను గురువారం కూడా నిర్వహించనున్నట్టు సమితి చైర్మన్‌ మందకృష్ణ తెలిపారు. సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, జె.బి.రాజు, జి. చెన్నయ్య, బెల్లయ్య నాయక్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top