టీడీపీ సభ్యులపై మండలి చైర్మన్‌ ఆగ్రహం..

Council Chairman Shariff Disappoints With TDP MLAs Behaviour - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ​ప్రదేశ్‌ శాసనమండలి సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సభలో అనవసర రాద్ధాంతం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మండలి చైర్మన్‌ షరీఫ్‌ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రసారాలు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. టీవీ ప్రసారాలకు సాంకేతిక సమస్య తలెత్తిందని.. దానిని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. మంత్రి సమాధానంతో ఏకీభవించిన మండలి చైర్మన్‌ షరీఫ్.. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించాలని ఆదేశించారు.

అయితే టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్‌ చెప్పిన కూడా వినిపించికోకుండా.. టీవీ లైవ్‌ల కోసం ఆందోళన కొనసాగించారు. పదే పదే టీవీ ప్రసారాల పేరుతో టీడీపీ సభ్యులు మండలి సమావేశాలను అడ్డుకోవడంపై చైర్మన్‌ అసహనం చెందారు. టీవీ ప్రసారాలు తప్ప మరే అంశం లేదా అంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top