‘వైరస్‌ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం కాదు’ | Coronavirus YSRCP Leader Vijaya Sai Reddy Satires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘వైరస్‌ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం కాదు’

Apr 29 2020 1:12 PM | Updated on Apr 29 2020 2:57 PM

Coronavirus YSRCP Leader Vijaya Sai Reddy Satires On Chandrababu - Sakshi

సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నవాడివి నీకేం తెలుసని వైఎస్‌ జగన్ గారిపై విషం చిమ్ముతున్నావు?

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కట్టడి చర్యల్లో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుంటే.. పచ్చ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని టీడీపీ నేతలకు ట్విటర్‌ వేదికగా హితవు పలికారు. ‘కరోనా వైరస్ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం లాంటిది కాదు చంద్రబాబూ. దోమలను నియంత్రించావా? వైరస్సూ అంతే. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నవాడివి నీకేం తెలుసని వైఎస్‌ జగన్ గారిపై విషం చిమ్ముతున్నావు? ప్రజల గురించి మొసలి కన్నీళ్లు కార్చవద్దు. కరోనా కట్టడిలో రాష్ట్రమే ముందు నిలుస్తుంది’అని పేర్కొన్నారు.
(చదవండి: గుర్తు తెలియని వ్యక్తి హల్‌ చల్‌)

సీఎం జగన్‌ చెప్పింది నిజం..
వ్యాక్సిన్ వచ్చేదాక కరోనాతో సహజీనం తప్పదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది 100 శాతం సరైందని విజయసాయిరెడ్డి అన్నారు. వైరస్ నిర్మూలనకు నేరుగా పనిచేసే మందులేవీ ఉండవని, వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్లాస్మా థెరపీ ఆశలు రేకిత్తిస్తోందని, కేంద్రం కూడా దీనికి అనుమతించిందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం వైఎస్‌ జగన్‌ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ నిధులు, విద్యా దీవెన కింద రూ.4 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. వాటిలో బాబు హయాంలోని బకాయిలూ ఉన్నాయని వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలంతా నిశ్చింతగా ఉంటే చూపించే దమ్ము ఎల్లో మీడియాకు లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కుల పెద్ద ఏదో లేఖ అని వదిలితే రోజంతా అదే చెత్త చూపించారని చురకలంటించారు. ‘అంతా తనకే తెలుసనే భ్రాంతి నుంచి చంద్రబాబు బయటపడలేడు. అనామకుడిగా మిగిలిపోయి, ఎవరూ పట్టించుకోకపోయేటప్పటికి గింజుకుంటున్నాడు పాపం. బహిరంగ లేఖట! ఈయన లేఖను నమ్మి ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మాకు బాబే కావాలి అని రెచ్చిపోవాలనేది ఆయన ఆశ. కుల మీడియా భజన తప్ప ఎక్కడా చప్పుళ్లు లేవు’అని మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 
(చదవండి: కరోనా: ఏపీలో మరో 73 పాజిటివ్‌ కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement