ఆంగ్లో–ఇండియన్‌ ఎమ్మెల్యే నియామకాన్ని అడ్డుకోండి

Congress,jds move SC againest nomination of Anglo-Indian MLA in Karnataka - Sakshi

యశవంతపుర: కర్ణాటక విధానసభకు ఆంగ్లో ఇండియన్‌ వినీషా నీరోను నామినేట్‌ చేస్తూ గవర్నర్‌ వజుభాయ్‌ వాలా తీసుకున్న నిర్ణయంపై  కాంగ్రెస్‌–జేడీఎస్‌లు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే వరకూ గవర్నర్‌ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై దాఖలైన పిటిషన్‌తోపాటుగా నేడు ఈ పిటిషన్‌ సుప్రీంలో విచారణకు రానుంది. గురువారం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆంగ్లో–ఇండియన్‌ను గవర్నర్‌ నామినేట్‌ చేశారు.  

గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీంకు జెఠ్మలానీ
యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ సీనియర్‌ న్యాయవాది రాం జెఠ్మలానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే తరహా పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని సీజేఐ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ఆయనకు సూచించింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top