కాంగ్రెస్‌ పక్ష నేత నియామకం సందిగ్ధం

Congress yet to decide on leader in Lok Sabhanot des - Sakshi

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలి సమావేశం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అలాగే సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసుకునే విషయంలోనూ ముందడుగు పడలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశమే జరగలేదు. దీనిపై కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ చాలా  ప్రతిపక్ష పార్టీలు సభలో తమ పార్టీ పక్ష నాయకుడిని ఎంపిక చేయలేదనీ, ఆ పని పూర్తయిన అనంతరం ప్రతిపక్ష పార్టీల భేటీ ఉండొచ్చని అన్నారు.

ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆధిర్‌ రంజన్‌ చౌధురీ, కేరళ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్‌ హాజరయ్యారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా నియమించే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ, ఎదురుగాలిలోనూ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్‌ తరఫున గెలిచిన శశి థరూర్‌ల పేర్లు కూడా ఈ రేసులో ఉన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top