
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాలే ప్రధానమన్న రీతిలో పంచాయతీరాజ్ చట్టానికి టీఆర్‌ఎస్ సవరణలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మె ల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, సర్పంచ్ ఎన్నికను పరోక్ష పద్ధతికి మార్చా లని టీఆర్‌ఎస్ భావించడం సరికాదన్నారు. సవరణల విషయమై అఖిలపక్ష నేతలు, రాజ్యాంగ నిపుణులతో కమిటీని వేసి సమగ్రంగా చర్చించాలని సూచించారు.