
రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ నల్లగొండ, మిర్యాలగూడలలో అండర్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు.
సమస్యలను వివరించేందుకు మున్సిపల్ మంత్రి అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.