వసుంధర రాజేకు ఘోర అవమానం... | Congress MLA insulting Vasundhara Raje | Sakshi
Sakshi News home page

వసుంధర రాజేకు ఘోర అవమానం...

Jan 7 2019 6:14 PM | Updated on Mar 18 2019 7:55 PM

Congress MLA insulting Vasundhara Raje - Sakshi

రాజేను దారుణంగా అవమానించిన కాంగ్రెస్‌ నాయకుడు

జైపూర్‌ : రాజస్తాన్‌ మాజీ సీఎం వసుంధర రాజేను దారుణంగా అవమానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కాంగ్రెస్‌ లీడర్‌ రామ్‌లాల్‌ మీన మాజీ సీఎం వసుంధర రాజే ప్రస్తుతం అభివృద్ధి పనులను పక్కన పెట్టి మద్యం బాటిళ్లు ఒపెన్‌ చేయడంలో చాలా బిజీగా ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన మీనా మాట్లాడుతూ.. ‘నూతన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. కానీ మాజీ సీఎం రాజే మాత్రం పని పక్కన పెట్టి లిక్కర్‌ బాటిళ్లు ఒపెన్‌ చేయడంలో బిజీగా ఉన్నారం’టూ వ్యాఖ్యనించారు. రామ్‌లాల్‌ మీనా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమరాన్ని రేపుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement