‘అబద్దాల బ్రాండ్‌ అంబాసిడర్‌ హరీశ్‌’

Congress Leader Ponnam Prabhakar Fires On TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ హుస్నాబాద్‌ సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనాలు పెద్దగా సభకు తరలి రాలేదన్నారు. సభ సక్సెస్‌ కాకున్నా విజయవంతం అయిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సభలో ప్లెక్సీలు కట్టింది కూడా స్థానికేతరులేనని ఆరోపించారు. అభివృద్ధిపై  ఏం చెప్పుకోలేని పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు.

అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అపద్ధర్మ మంత్రి హరీశ్‌ రావు  అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఎద్దేవా చేశారు. ఒక్క సారి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే పూర్తికాలం కొనసాగలేదని.. మళ్లీ గెలిపిస్తే ఏడాదికే రద్దు చేయడరని నమ్మకమేంటని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని పొన్నం ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top