‘ఆ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం’

Congress Leader Komatireddy Venkat Reddy Slams KCR In Yadadri Bhuvanagiri District Over Hajipur Incident - Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లా: హాజీపూర్‌ ఘటన సభ్య సమాజం తలదించుకునే ఘటన అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఎక్కడో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే అందరం స్పందించాం.. హాజీపూర్‌ దారుణంపై ఇక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. బాధితులు ఆమరణ నిరాహార దీక్షకు దిగినా సీఎం కేసీఆర్‌ మనసు కరగలేదని విమర్శించారు.

ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ తన మానవత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాధితులతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top