కేంద్ర మంత్రి అనంతకుమార్‌ను అరెస్టు చేయాలి | congress demand to arrest central minister | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి అనంతకుమార్‌ను అరెస్టు చేయాలి

Dec 28 2017 4:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

congress demand to arrest central minister - Sakshi

వైట్‌ఫీల్డ్ (బెంగుళూరు) : ఎస్సీల విషయంలో రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ... కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వైట్‌ఫీల్డ్‌ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇన్నర్‌ సర్కిల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లూరుహళ్ళి నాగేష్‌ నాయకత్వంలో ర్యాలీగా స్థానిక వైట్‌ఫీల్డ్‌ డీసీపీ కార్యాలయం వరకు వెళ్ళారు. అక్కడ మంత్రి అనంతకుమార్‌ హెగ్డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రిని వెంటనే అరెస్టు చేయాలని... మంత్రి తన పదవికి రాజీనామా చేయలంటూ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

కేపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లూరుహళ్ళి నాగేష్‌ మంత్రి మాట్లాడిన సీడీని, కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు అందజేశారు. ఈసందర్భంగా నల్లూరుహళ్ళి నాగేష్‌ మీడియాతో మాట్లాడుతూ ఉన్నత పదవిలోవున్న మంత్రి అనంతకుమార్‌ ఎస్సీలను అసహనానికి గురిచేసే విధంగా ఒక బహిరంగ సభలో మాట్లాడడం సరికాదని ఖండించారు. ఈ విషయమై భారతీయ జనతాపార్టీలోవున్న ఎస్సీ విభాగం నాయకులు సైతం వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి వ్యక్తిపై కేసు నమోదుచేసి.. అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ నాయకులు కృష్ణప్ప, వెంకటేష్, హరీష్, పృద్వీ, రాజకుమార్, శివ, భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement