సోనియాపై వ్యాఖ్యలు.. కేటీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం | Comments on Sonia Gandhi, KTR Effigy burnt by Women Congress | Sakshi
Sakshi News home page

Jun 30 2018 4:02 PM | Updated on Mar 18 2019 9:02 PM

Comments on Sonia Gandhi, KTR Effigy burnt by Women Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీపై మంత్రి కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు నెరేళ్ల శారదా ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ఎదుట కేటీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ డౌన్‌డౌన్‌ అని నినాదాలు చేస్తూ.. మహిళలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. దీంతో గాంధీభవన్‌ ముందు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement