పూరీ జగన్నాథ ఆలయంలో కేసీఆర్‌ పూజలు

CM KCR Visits Puri Jagannath Temple - Sakshi

సాక్షి, ఒడిశా: ఒడిశా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యలతో కలిసి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. పూరీ ఆలయంతోపాటు కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని కూడా కేసీఆర్‌ సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం  కోల్‌కతాకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. కోల్‌కతాలోని కాళీ మందిరాన్ని ఆయన దర్శించుకోనున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోనే కేసీఆర్‌ మకాం వేసి.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై పలు పార్టీల నాయకులతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కేసీఆర్‌ తాజా పర్యటనను చేపట్టిన సంగతి తెలిసిందే.


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top