కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్‌ను తొలగించి.. | Chidambaram Counter To Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

May 13 2018 9:04 PM | Updated on Mar 18 2019 9:02 PM

Chidambaram Counter To Nirmala Sitharaman - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నిర్మలా సీతారామన్‌ను మంత్రిగా తొలగించి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగంలో లాయర్‌గా నియమించారు’ అని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించని చిదంబరంను పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో పోలుస్తూ.. నిర్మలా సీతారామన్‌ చేసిన ‘కాంగ్రెస్‌ నవాజ్‌ షరీఫ్‌ మూమెంట్‌’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ట్వీట్‌ చేశారు. ‘చిదంబరం ఆయన కుటుంబం విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించలేదని, అయిన కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఇది కాంగ్రెస్‌ నవాజ్‌ షరీఫ్‌ మూమెంట్‌’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు.

ఇది చదవండి : ఇదీ కాంగ్రెస్‌.. నవాజ్‌ షరీఫ్‌ మూమెంట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement