ప్రధానిగా అవకాశం వచ్చినా వద్దనుకున్నా

Chandrababu Naidu Road Show in Mallapur Hyderabad - Sakshi

మల్లాపూర్‌: దేశ భవిష్యత్‌ కోసమే కాంగ్రెస్‌ పార్టీతో పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాకూటమి రోడ్‌షోలో భాగంగా ఆదివారం మల్లాపూర్‌ శివ హోటల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, ఉప్పల్‌ ప్రజాకూటమి అభ్యర్థి తూళ్ల వీరేందర్‌గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తన హయాంలోనే హైదరాబాద్, ఔటర్‌ రింగురోడ్డు, హైటెక్‌ సిటీ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. మేడ్చల్‌లో కూడా మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ హాయాంలోనే ఉప్పల్‌ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ, కేసీఆర్‌ జోడీ అని ఎద్దేవా చేశారు. ఏ టీమ్‌ నరేంద్రమోదీ అయితే బీ టీమ్‌ కేసీఆర్‌గా అభివర్ణించారు.

డబుల్‌ బెడ్రూంకు, దళిత ముఖ్యమంత్రి, ప్రాజెక్టులకు తానేనాడు అడ్డుపడలేదని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే తన ఆశయమన్నారు. టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. అందులో భాగంగా వీవీప్యాడ్‌లు తీసుకువచ్చామన్నారు. తనకు ప్రధానమంత్రిగా రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ వద్దనుకున్నానన్నారు. ప్రజాకూటమి అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దేవేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డుపడకుంగా ప్రోత్సహించానన్నారు. చంద్రబాబు హాయాంలోనే ఉప్పల్, కాప్రా అభివృద్ధి చేందాయన్నారు. ఈ కార్యక్రమంలో రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నెమలి సురేష్, వీఎస్‌ బోస్, సూర్ణం రాజేష్, చిన్న దుర్గయ్య, ఎల్లగోని పాండురంగంగౌడ్, అభిషేక్‌గౌడ్, లంబూ శ్రీను, ఆంజనేయులు, రాజు, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top