తెలుగు మహిళపై చంద్రబాబు యుద్ధం

Chandrababu Election Campaign Against Sumalatha - Sakshi

మండ్యలో సుమలతను ఓడించాలని ప్రచారం 

భగ్గుమన్న తెలుగు ప్రజలు

సాక్షి బెంగళూరు/ యశవంతపుర (బెంగళూరు): అలనాటి నటి, ఇటీవల భర్తను కోల్పోయిన తెలుగింటి ఆడబిడ్డ సుమలతను ఎన్నికల్లో ఓడించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. తన భర్త అంబరీష్‌ ఆశయ సాధన కోసం మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆమెకు మద్దతుగా నిలబడడానికి బదులు ఓడించేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. మండ్యలో కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ తరఫున చంద్రబాబు ప్రచారానికి దిగనున్నారు. దీనిపై కన్నడనాట ఉన్న తెలుగువారి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేనా 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయం అని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం చంద్రబాబు నిఖిల్‌ తరఫున మండ్య సమీపంలోని పాండవపురంలో ప్రచారం చేశారు. 

చంద్రబాబు ప్రభావం ఉండదు: సుమలత 
ఏపీ సీఎం చంద్రబాబు మండ్యకు వచ్చి జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదని నటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత స్పష్టం చేశారు. సోమవారం ఆమె మండ్య పరిధిలోని మంచనహళ్లిలో ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. మండ్యలో తెలుగువారు లేనందున చంద్రబాబు జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసినా ఆయన ప్రభావం ఏమీ ఉండదన్నారు.   

ప్రధాని పదవికి వన్నె తెచ్చిన దేవెగౌడ 
కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఓటర్లను కోరారు. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, సీఎం కుమారస్వామిలకు మద్దతుగా సోమవారం సాయంత్రం ఆయన మండ్య లోక్‌సభ నియోజకవర్గంలోని పాండవపురలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. దక్షిణ భారత్‌కు దేవెగౌడ పెద్దదిక్కు అని, దేశం కోసం ఆయన ప్రధాని పీఠం చేపట్టి.. ఆ పదవికే వన్నె తెచ్చారని పొగడ్తలు గుప్పించారు. తొలుత కన్నడలో కొన్ని పదాలు మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. మండ్యలో దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పతనమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, బీజేపీని గెలిపిస్తే దేశం నాశనం అవుతుందని, ప్రధాని మోదీ, అమిత్‌షా అవినీతిపరులని ధ్వజమెత్తారు. మోదీనే మరోసారి ప్రధాని కావాలంటూ శత్రు దేశమైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ దేశంతో కలసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని, ఈ ఎన్నికల్లో మోదీ ఓడిపోయి గుజరాత్‌కు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు

19-04-2019
Apr 19, 2019, 04:28 IST
బదౌన్‌/వంత్లి: తాము అధికారంలోకి వస్తే రుణం తిరిగి చెల్లించలేని రైతులను జైళ్లకు పంపబోమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు....
19-04-2019
Apr 19, 2019, 04:22 IST
సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్‌కోట: భారత తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ...
19-04-2019
Apr 19, 2019, 04:11 IST
రాంపూర్‌: సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్‌ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్‌’ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ...
19-04-2019
Apr 19, 2019, 03:47 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో 67.84% ఓటింగ్‌...
19-04-2019
Apr 19, 2019, 03:06 IST
చెన్నై నుంచి తిరుపతి వైపు తరలిస్తున్న 1,381 కేజీల బంగారాన్ని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు అధికారులు బుధవారం రాత్రి...
19-04-2019
Apr 19, 2019, 00:54 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి యథేచ్ఛగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ఓట్లు కొనుగోలు పథకాలకు రాష్ట్ర ఖజానా...
19-04-2019
Apr 19, 2019, 00:44 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ భారీ కుట్రలో భాగంగానే రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి...
19-04-2019
Apr 19, 2019, 00:26 IST
లోక్‌సభ ఎన్నికలంటే అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా దీనికి పేరుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 80...
18-04-2019
Apr 18, 2019, 20:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు అతీతంగా పని చేస్తుందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార...
18-04-2019
Apr 18, 2019, 20:52 IST
సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు పోలీసులు బుధవారం సీజ్‌ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముంగిట...
18-04-2019
Apr 18, 2019, 19:17 IST
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని..
18-04-2019
Apr 18, 2019, 18:59 IST
న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు జీవీఎల్‌ నరసింహారావు ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయనపై శక్తి భార్గవ అనే వ్యక్తి...
18-04-2019
Apr 18, 2019, 18:54 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ అసోసియేషన్‌ సభ్యులు గురువారం కలిశారు. ఎన్నికల...
18-04-2019
Apr 18, 2019, 18:32 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నారు.
18-04-2019
Apr 18, 2019, 18:07 IST
కేంద్ర మంత్రి నక్వీకి ఈసీ వార్నింగ్‌
18-04-2019
Apr 18, 2019, 18:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశ పోలింగ్‌ ముగిసింది. చెదురు మదురు సంఘటన తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రెండోవిడత...
18-04-2019
Apr 18, 2019, 17:44 IST
పూనం నామినేషన్‌ కార్యక్రమానికి శత్రుఘ్న సిన్హా హాజరు
18-04-2019
Apr 18, 2019, 16:38 IST
కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ముఖేష్‌ అంబానీ
18-04-2019
Apr 18, 2019, 16:07 IST
పట్నా : దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా...
18-04-2019
Apr 18, 2019, 15:50 IST
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వైఎస్సార్‌సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top