‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కు’

Central and state governments colluded - Sakshi

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులతో కుమ్మక్కయ్యాయని అనుమానంగా ఉందని మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..గత ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ మీద నెపం నెట్టడానికే సమీక్షలు చేస్తున్నారు తప్ప టీఆర్‌ఎస్‌ రైతుల కోసం చేసింది శూన్యమన్నారు.మద్దతు ధర కోసం రూ. 2 వేల కోట్లు పెడతామని తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని తెలిపారు. కానీ ఒక్క బడ్జెట్లో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు.

2008లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతుల కోసం 153 జీవో తెచ్చారని చెప్పారు. రూ.30 కోట్లు విడుదల చేసి, రూ.11 కోట్లు ట్రేడర్ మీద యాక్ట్ కోసం  నిధులు ఇచ్చామని వివరించారు. రైతుల మీద ప్రేమకు అది నిదర్శనమన్నారు. మీరేం చేశారో చెప్పగలరా..? అని టీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎర్రజొన్న, పసుపు రైతుల కోసం 15 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు గిట్టుబాటు ధర కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top