పారదర్శకంగా ఫలితాల ప్రకటన : ఈసీఐ నిఖిల్‌ కుమార్‌

CEC Conduct Training Programme For Officials Over Counting - Sakshi

సాక్షి, విజయవాడ : ఈవీఎం, వీవీప్యాట్‌లు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్‌ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. ఈసీఐ డైరెక్టర్‌ నిఖిల్‌ కుమార్‌ ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులకు ట్రైనింగ్‌ ఇచ్చారు.

కౌంటింగ్‌ కేంద్రాలలో టేబుల్స్‌ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్‌ అంశాలపై ఈసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఈసీఐ డైరెక్టర్‌ నిఖిల్‌ కుమార్‌ వెల్లడించారు. అభ్యర్థుల వారిగా వీవీప్యాట్‌ స్లిప్పులను సాగ్రిగేట్‌చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా 25 వీవీప్యాట్‌ స్లిప్పులను ఒక బండిల్‌గా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆర్వోలు పూర్తిగా నిర్థారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top