AP Capital Latest News: చంద్రబాబు, టీడీపీ నేతల వ్యాపారం కోసం అమరావతిని నిర్మించారు | Buggana Rajendranath Reveals Lands Details of Amaravati Surroundings - Sakshi
Sakshi News home page

భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన

Published Mon, Jan 20 2020 1:29 PM

Buggana Rajendranath Reddy Speech In Special Assembly Session On AP Capital - Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్న భూముల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సాక్షిగా ఆయన బట్టబయలు చేశారు. రాజధాని ప్రకటన ముందు చంద్రబాబు నాయుడు అక్రమంగా భూములు కొనుగోలు చేసేందుకు తొలుత గుంటూరు, ఆ తరువాత నూజివీడును రాజధానిగా ప్రచారం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. (మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!)

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు 4070 ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు మంత్రి సభలో వివరించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో పాటు రాజ్యాంగ్నాన్నీ ఉల్లంఘించారని విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో భాగంగా.. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేసిన భూముల వివరాలను మంత్రి బుగ్గన సభలో చదవి వినిపించారు. (అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?)

‘కంతేరులో హెరిటేజ్‌ పేరుతో 15 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేశారు. తుళ్లురులో టీడీపీకి చెందిన ముఖ్యనేత దినకర్‌ భూములను కొన్నారు. వేమురి రవికుమార్‌ కుటుంబ సభ్యులుపై కూడా అమరావతి ప్రాంతంలో భూమలు ఉన్నాయి. జీవీఎస్‌ ఆంజనేయులు 40 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. పయ్యవుల కేశవ్‌, ధుళీపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావులకూ భూములున్నాయి. యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయి. టీడీపీ నేతలకు చెందిన బినామీలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలుకు పాల్పడ్డారు. నారా లోకేష్‌కు చెందిన బినామీలు వందల ఎకరాల్లో భూములు దోచుకున్నారు. బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్‌ బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. లంక భూములు, పోరంబోకు, అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లు తీసుకున్నారు. సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్‌లు కూడా అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారు. ఇంత వీరిలో పాటు అనేకమంది టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం చేశారు. (సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స)

అమరావతి ప్రాంతంలో 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించారు. 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున అప్పగించారు. ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. రాజధాని పేరు చెప్పి అన్ని భూములను టీడీపీ నేతలు స్వాహా చేశారు. ఇంత స్కామ్‌లో అమరావతిని రాజధానిగా కట్టాలంటారా?. వ్యాపార ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అమరావతిని చేపట్టారు. అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా?. ’ అని అన్నారు.

చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..

Advertisement
Advertisement