అతడి తల నరికి తెస్తే 5 లక్షలు : బీజేపీ నేత

Bring Head of Madsaur case Accused And Take 5 Lakh Rupees - Sakshi

భోపాల్‌ : మంద్‌సౌర్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుడి తల నరికి తెస్తే ఐదు లక్షలు ఇస్తానంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత సంజీవ్‌ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్‌ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోర్టు లేదా ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే.. అతని తల నరికి తెచ్చిన వారికి నేనే 5 లక్షలు ఇస్తా అని సంజీవ్ మిశ్రా అన్నారు.

కాగా, సంజయ్‌ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. మంద్‌సౌర్‌లో 8 ఏళ్ల బాలికపై జరిగిన రేప్‌పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. బాధిత చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తనకు డబ్బు అవసరం లేదని, నిందితున్ని ఉరి తీయాలని ఆ చిన్నారి తండ్రి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top