
గంగాధర: కేసీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కనందుకే తనకు టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వలేదని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో అడిగినా సమాధానం ఇవ్వలేదన్నారు. ఆది నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నా.. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినా పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు.