‘లోకేశ్‌కు తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదు’ | BJP Yuva Morcha Protest In Vijayawada | Sakshi
Sakshi News home page

Sep 21 2018 12:53 PM | Updated on Sep 21 2018 12:54 PM

BJP Yuva Morcha Protest In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్‌కు తప్ప రాష్ట్రంలో మరొకరికి ఉద్యోగం రాలేదని బీజేపీ యువ మోర్చా నాయకులు విమర్శించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ.. యువ మోర్చా నాయకులు  శుక్రవారం విజవాడలో వినూత్న నిరసనకు దిగారు. చెవిలో పూలు, చేతిలో చిప్ప పట్టుకుని భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం, రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికి వరకు ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement