మోదీకి ప్రేమతోనే జవాబిస్తా

BJP, RSS & Modi have hatred for my family - Sakshi

నా కుటుంబంపై ద్వేషాన్ని పెంచుకున్నారు: రాహుల్‌

షుజాల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌): బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీలు తన కుటుంబంపై ద్వేషం చూపిస్తున్నాయని తను మాత్రం వారికి ప్రేమనే పంచుతానని కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ అన్నారు. మోదీ తనతోపాటు తన కుటుంబంపై చూపే ద్వేషానికి ప్రేమతోనే జవాబిస్తానని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు. రాజీవ్‌ గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలపై మోదీ బహిరంగ విమర్శలు చేశారని.. దీనికి ప్రతిగా తాను ప్రధానికి కౌగిలింత ఇచ్చానని చెప్పారు. పార్లమెంట్‌లో తాను రఫేల్‌ స్కాం గురించి ప్రధానిని ప్రశ్నిస్తే ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా తన కుటుంబం గురించి మాట్లాడారని గుర్తు చేశారు.   

మెకానిక్‌గా మారిన రాహుల్‌!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ మెకానిక్‌లా మారారు. ప్రచారంలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా నుంచి మండికి వెళ్తుండగా.. రాహుల్‌ హెలికాప్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో మెకానిక్‌ కోసం వేచిచూడకుండా స్వయంగా రాహుల్‌ రంగంలోకి దిగారు. ‘ఉనా పర్యటన సమయంలో హెలికాప్టర్‌లో సమస్య తలెత్తింది. మేమంతా కలిసి దానిని సరిచేశాం. టీమ్‌ వర్క్‌తో ఏదైనా సాధించగలం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’అని పేర్కొన్నారు. ఈ ఫొటోను రాహుల్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top