ధైర్యం ఉంటే ఓయూలో అడుగుపెట్టాలి 

BJP Leader Srinivas Reddy Slams KCR In Karimnagar  - Sakshi

సాక్షి, జగిత్యాల: సీఎంకు ధైర్యం ఉంటే ఓయూలో అడుగుపెట్టి, విద్యార్థులతో మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం జిల్లాకేంద్రంలోని కౌండిన్య ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన బీజేపీ సమీక్షబైటక్‌లో శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర రైతాంగానికి యూరియా అందించడంలో విఫలం అయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సిద్దిపేటలో రైతు చనిపోయినా చలనం లేదన్నారు. రైతు రుణమాఫీ హామీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లభిస్తోందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ లింగంపేట శ్రీనివాస్, గుడాల రాజేశ్‌గౌడ్, ఆంకారి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top