‘ఆ హక్కు చంద్రబాబుకు లేదు’ | BJP leader shanta reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘ఆ హక్కు చంద్రబాబుకు లేదు’

Mar 26 2018 4:25 PM | Updated on Mar 26 2018 4:25 PM

BJP leader shanta reddy slams chandrababu naidu - Sakshi

బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి

సాక్షి, తిరుపతి: పార్టీలను ప్రశ్నించే హక్కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి అన్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పాలనంతా అవినీతి మయమేనని విమర్శించారు.

పోలవరంలో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారని.. ఈ అంశంపై కేంద్రం ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. పట్టిసీమలో రూ. వందల కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement