‘ఎన్టీఆర్‌ అభిమానులు ప్రశ్నించాలి’ | BJP Leader Kishan Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Nov 1 2018 11:04 AM | Updated on Mar 18 2019 9:02 PM

BJP Leader Kishan Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన టీడీపీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ దగ్గర తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెడుతోందని తెలంగాణ బీజేపీ నాయకుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అవతరన దినోత్సవం ( 01 నవంబర్‌) రోజే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలవడం శోచనీయమన్నారు.

టీడీపీ కాంగ్రెస్‌తో జతగట్టి ఎన్నికలకు వెళ్లడం అంటే ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లేనన్నారు. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభించేలా, అధికారమే పరమావధిగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలయికను ఎన్టీఆర్‌ అభిమానులు ప్రశ్నించాలని కోరారు. ఇప్పుడున్నది నందమూరి టీడీపీ కాదని.. నారా టీడీపీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి కావాల్సింది రాష్ట్రాభివృద్ధి కాదని, తన అధికారం కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో పోత్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement