మహాకూటమి ఓ మాయకూటమి : కిషన్‌రెడ్డి | BJP Leader Kishan Reddy Comments On Grand Alliance | Sakshi
Sakshi News home page

మహాకూటమి ఓ మాయకూటమి : కిషన్‌రెడ్డి

Nov 19 2018 6:40 PM | Updated on Nov 19 2018 6:48 PM

BJP Leader Kishan Reddy Comments On Grand Alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలను ఆకర్షించటంలో మహాకూటమి విఫలమైందని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి అన్నారు. మహాకూటమిని మాయకూటమిగా ఆయన అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమిలో 119 స్థానాలుంటే 130 మంది నామినేషన్‌ వేశారన్నారు. మహాకూటమిలో ఉన్నవారే ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంలో కేసీఆర్‌ యజ్ఞాలు చేస్తున్నారని, ఇప్పుడు ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పోలీసుల నిర్భంధాల కారణంగా ప్రజలు ధర్నాలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

డిసెంబర్‌ 7 ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బుద్దిచెప్తారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమంగా రోహింగ్యాలను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు కార్డు, రేషన్‌ కార్డులు వారికి ఎలా వచ్చాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లు అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement